ఇసుక తరలింపును అడ్డుకున్నవారిపై కేసు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్‌లో గ్రామస్థులపై దాడులకు పాల్పడినవారిపై కేసులు నమోదుచేశామని కొల్లిపర ఎస్సై ఆర్‌.రవీంద్రారెడ్డి శనివారం తెలిపారు.

Published : 31 Mar 2024 04:37 IST

కొల్లిపర, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్‌లో గ్రామస్థులపై దాడులకు పాల్పడినవారిపై కేసులు నమోదుచేశామని కొల్లిపర ఎస్సై ఆర్‌.రవీంద్రారెడ్డి శనివారం తెలిపారు. మున్నంగి గ్రామానికి చెందిన వేమూరి మోషే, వేమూరి చింతయ్య, యల్లమాటి సంజీవ్‌, మల్లికార్జున్‌, అంజి తదితరులపై వేమూరి అశోక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. వేమూరి మోషే ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేమూరి అశోక్‌, బాలరాజు, వేమూరి రాజేష్‌లపైనా కేసు నమోదు చేశామన్నారు. మున్నంగి ఇసుక రీచ్‌లో ఇసుక అక్రమ తరలింపులు నిలువరించాలంటూ అడ్డుపడిన గ్రామస్థులపై.. అక్రమార్కులు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. అక్రమ తరలింపును అడ్డుకున్న బాధితులపైనా కేసులు నమోదు చేయడాన్ని ప్రజలు విమర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు