పాఠశాల బస్సు బోల్తా.. ఆరుగురి దుర్మరణం

హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహేంద్రగఢ్‌ జిల్లాలో గురువారం ఉదయం పాఠశాల విద్యార్థులను తీసుకెళుతున్న బస్సు చెట్టును ఢీకొని బోల్తా పడింది.

Updated : 12 Apr 2024 06:09 IST

20 మందికి గాయాలు
హరియాణాలో ఘటన

చండీగఢ్‌: హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మహేంద్రగఢ్‌ జిల్లాలో గురువారం ఉదయం పాఠశాల విద్యార్థులను తీసుకెళుతున్న బస్సు చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పాఠశాల ప్రిన్సిపల్‌, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రమాదం సంగతి తెలియగానే ఘటనా స్థలానికి వెళ్లిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా.. రంజాన్‌ పర్వదినం సందర్భంగా గురువారం సెలవు ప్రకటించినప్పటికీ పాఠశాలకు ఎందుకు సెలవు ఇవ్వలేదనే విషయమై ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యానికి షోకాజ్‌ నోటీసు జారీ చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని