నిర్మాణానికి తీసుకొచ్చిన ఇసుకలో మృతదేహం

ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ఇసుకలో తల లేని మృతదేహం బయటపడిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.

Published : 13 Apr 2024 05:51 IST

బాపట్ల జిల్లాలో కలకలం

చీరాల అర్బన్‌ (ఈపూరుపాలెం) న్యూస్‌టుడే: ఇంటి నిర్మాణం కోసం తీసుకొచ్చిన ఇసుకలో తల లేని మృతదేహం బయటపడిన ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చీరాల మండలం ఈపూరుపాలేనికి చెందిన కాగిత రాంబాబు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. దీని నిమిత్తం నాలుగు రోజుల క్రితం ఒక గుత్తేదారుడితో ఇసుక కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు రాత్రి సదరు గుత్తేదారు పది ట్రాక్టర్ల ఇసుక తీసుకొచ్చి కుప్పగా పోశారు. శుక్రవారం దాన్ని పొక్లెయిన్‌తో  బేస్‌మెంట్‌లో పోయడానికి ప్రయత్నించగా మృతదేహం బయటపడింది. మృతదేహానికి తల లేదని, ఎడమ చేయి చిన్నగా ఉండగా కుడి చేయిపై ప్రేమ చిహ్నంతో పాటు పసుపుపచ్చ దారం కట్టి ఉందని చీరాల గ్రామీణ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పరీక్ష నిమిత్తం చీరాల ఆసుపత్రికి తరలించారు. ఇసుకను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని