అక్రమ వడ్డీ వ్యాపారులపై ఉక్కుపాదం

ఎలాంటి అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం ఏకకాలంలో సిద్దిపేట జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, ముఖ్యమైన గ్రామాల్లో సోదాలు నిర్వహించారు.

Published : 14 Apr 2024 03:16 IST

సిద్దిపేట జిల్లాలో 38 కేసులు నమోదు
రూ.1.21 కోట్లు స్వాధీనం

న్యూస్‌టుడే, సిద్దిపేట: ఎలాంటి అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం ఏకకాలంలో సిద్దిపేట జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాలు, ముఖ్యమైన గ్రామాల్లో సోదాలు నిర్వహించారు. నిఘా వర్గాల సమాచారం మేరకు 24 బృందాలుగా ఏర్పడ్డ పోలీసులు.. ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా  ఫైనాన్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఇళ్లు, దుకాణాల్లో నిశితంగా పరిశీలించారు. ప్రైవేటు చిట్టీలు నడిపే వారిళ్లలోనూ సోదాలు చేశారు. మొత్తం 38 కేసులు నమోదు చేయగా.. రూ.1,21,27,120 నగదు, 70 తులాల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి, వివిధ రకాల డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని