స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి

స్కాట్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.

Published : 20 Apr 2024 04:47 IST

లండన్‌: స్కాట్లాండ్‌లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు. అధికారుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జితేంద్రనాథ్‌ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22) స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్నారు. బుధవారం సాయంత్రం మరికొందరు భారతీయ స్నేహితులతో కలిసి పెర్త్‌షైర్‌లోని ‘లిన్‌ ఆఫ్‌ తమ్మెల్‌’కి వెళ్లారు. రెండు నదులు కలిసే ఈ ప్రాంతంలో వీరు ట్రెక్కింగ్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో వీరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదం పై లండన్‌లోని అధికారి స్పందించి.. మృతుల కుటుంబాలకు సమాచారం అందించామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను భారత్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని