యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!

మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు.

Published : 20 Apr 2024 05:49 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు ఎవరికీ వినిపించకుండా నోటిపై ప్లాస్టరు అంతికించడమే కాకుండా.. గాయాలపై కారం చల్లి హింసించాడు. బాధితురాలు తన తల్లితో కలిసి నివసించేది. నెల రోజుల క్రితం నిందితుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి తన ఇంట్లో బంధించాడు. పెళ్లి చేసుకోవాలని, ఆస్తిని తనకు అప్పగించాలని అతడు వేధించినట్లు యువతి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే లైంగికంగా వేధించి, చిత్రహింసలు పెట్టాడు. ఈ ఘటన సమయంలో ఆమె తల్లి వేరే ఊరికి వెళ్లింది. గత మంగళవారం రాత్రి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసుస్టేషనుకు చేరుకుంది. నోటికి ప్లాస్టరు అంటించి ఉండటం, కళ్లు వాచిపోయి, ఒళ్లంతా గాయాలతో ఉన్న ఆమెను చూసి చలించిన పోలీసులు వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఉన్నతాధికారి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు