సైబర్‌ మోసానికి యువకుడి బలి

సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మగ్గిడిలో చోటుచేసుకుంది.

Published : 21 Apr 2024 05:58 IST

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం మగ్గిడిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు భూమన్న చిన్న కుమారుడు మోతె నాగరాజు(19) డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవల ఫోన్‌లో ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేశాడు. అప్పటి నుంచి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌, మెసేజ్‌లు చేస్తూ తాము పోలీసులమని రూ.4 వేలు పంపించాలని లేదంటే కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. చివరకు ఆ యువకుడు రూ.3 వేలు పంపించగా.. మళ్లీ వేధింపులు కొనసాగించారు. రూ.5 లక్షలు పంపించాలని లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెదిరింపులను భరించలేని నాగరాజు ఈ నెల 18న గడ్డి మందు తాగాడు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే వారు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో రవి కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని