రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మంకు తీవ్రగాయాలు

రోడ్డు ప్రమాదంలో తెదేపా నాయకుడు నాదెండ్ల బ్రహ్మంకు తీవ్ర గాయాలయ్యాయి.

Updated : 21 Apr 2024 11:18 IST

అద్దంకి: బాపట్ల జిల్లా అద్దంకి-రేణింగివరం మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం చౌదరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి ఇటుక లోడుతో రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్‌ ట్రాలీని బ్రహ్మంచౌదరి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బ్రహ్మంను ఒంగోలు కిమ్స్‌లో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించనున్నారు. 

నారా లోకేశ్ విచారం

నాదెండ్ల బ్రహ్మం రోడ్డు ప్రమాదంలో గాయపడటంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విచారం వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వైద్యులతో మాట్లాడిన లోకేశ్‌.. అవసరమైన చికిత్సలు అందించాలని కోరారు. బ్రహ్మంకు తెదేపా అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని