పవన్‌ సభలో చాకుతో యువకుడు

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Published : 22 Apr 2024 05:41 IST

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా భీమవరం ప్రకాశం చౌక్‌లో ప్రసంగిస్తున్న సమయంలో ఇద్దరి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఓ యువకుడు పోలీసులపై చాకుతో దాడికి దిగాడు. అతడిని నిలువరించి అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అతడిని భీమవరం రెండో పట్టణ పరిధి బలుసుమూడి వాసిగా గుర్తించారు. ఇదే సమయంలో దుర్గాపురానికి చెందిన మరో వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ జేబు దొంగతనాలకు వచ్చారా? లేక చాకుతో దాడి చేసేందుకు వచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు