శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ముగ్గురి అరెస్ట్‌

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్‌కుమార్‌(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్‌(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది.

Updated : 24 Apr 2024 07:00 IST

బినామీలుగా ఉన్నట్లు గుర్తింపు

ఈనాడు-హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అనిశా మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఆయన ఆస్తులకు బినామీలుగా ఉన్న వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి(62), పెంట భరత్‌కుమార్‌(30), ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్‌(30)ను వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. అక్రమార్జనతో కొనుగోలు చేసే ఆస్తులను శివబాలకృష్ణ.. వీరి పేరిట రిజిస్టర్‌ చేయించేవాడని తేల్చింది. శివబాలకృష్ణ ఇంట్లో సోదాల సమయంలో వీరి ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు.. మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకూ ఐదుగురు అరెస్టయ్యారు. శివబాలకృష్ణ, ఆయన సోదరుడు శివనవీన్‌ అరెస్ట్‌ కాగా.. బెయిలుపై విడుదలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని