వైకాపా నాయకుడి ఇంట్లో 384 మద్యం సీసాలు

శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.

Updated : 24 Apr 2024 06:45 IST

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళంలోని కత్తెరవీధికి చెందిన వైకాపా నాయకుడు పైడి మహేశ్వరరావు నివాసంలో దాచి ఉంచిన 384 మద్యం సీసాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ప్రధాన అనుచరుడైన నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు బుధవారం నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని