రూ.105 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

Published : 20 May 2024 04:59 IST

గువాహటి: అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్‌ను అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్‌’లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. కచ్చర్‌ జిల్లాలో పది కేజీల బరువున్న హెరాయిన్‌ను తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారన్నారు. ఇద్దరు నిందితులతోపాటు రూ.105 కోట్ల విలువైన మత్తు పదార్థాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. యువత వ్యసనాల బారిన పడకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు