డిజిటల్‌ అరెస్టు... అంటే నమ్మకండి!

ఖాకీ యూనిఫాంలో కొంతమంది పోలీసులు... మరికొందరు టిప్‌టాప్‌ అధికారులు... వెనకాల గోడలకు సీబీఐ, ఆర్బీఐ, ఈడీలాంటి సంస్థల లోగోలు, ఆనవాళ్లతో... కొంతమంది లాప్‌టాప్‌లో, స్కైప్‌లో కనిపిస్తూ... యూ ఆర్‌ అండర్‌ డిజిటల్‌ అరెస్ట్‌... అనటం... మేం చెప్పేదాకా స్క్రీన్‌ ముందు నుంచి కదలొద్దు అనటం...

Published : 23 May 2024 03:28 IST

ఖాకీ యూనిఫాంలో కొంతమంది పోలీసులు... మరికొందరు టిప్‌టాప్‌ అధికారులు... వెనకాల గోడలకు సీబీఐ, ఆర్బీఐ, ఈడీలాంటి సంస్థల లోగోలు, ఆనవాళ్లతో... కొంతమంది లాప్‌టాప్‌లో, స్కైప్‌లో కనిపిస్తూ... యూ ఆర్‌ అండర్‌ డిజిటల్‌ అరెస్ట్‌... అనటం... మేం చెప్పేదాకా స్క్రీన్‌ ముందు నుంచి కదలొద్దు అనటం... ఇటీవలి కాలంలో తరచూ వినిపిస్తున్న మాటలు! డబ్బులు లాగటానికి సైబర్‌ నేరగాళ్లాడుతున్న సరికొత్త నాటకం ఇది. మామూలు మాటలకు లొంగటం లేదని నేరగాళ్లు ఈ కొత్త నాటకాలకు తెరలేపారు. ఇంటికి వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్‌ ఉన్నాయనో... మరోటో అనో భయపెట్టి... మీపై కేసు దాఖలైందని... మీరు డిజిటల్‌ అరెస్టు అయ్యారని బెదిరించి... అకౌంట్‌ మీదేనా కాదా చెక్‌ చేయాలంటూ... డబ్బులను బదిలీ చేయించటం... చివరకు డబ్బులు కొట్టేయటంలాంటి కథలు పెరిగిపోతున్నాయి. అందుకే... ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు... బెదరకుండా... నేరగాళ్ల మాయలో పడిపోకుండా... సైబర్‌క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1930కు ఫోన్‌ చేయటమో లేదా ప్రభుత్వ సైబర్‌క్రైమ్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారానో, స్థానిక పోలీసు స్టేషన్‌లోనో ఫిర్యాదు చేయాలని హోం మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని