జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం 6.20 గంటలకు విశాఖ స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరగా కాస్త దూరం వెళ్లేసరికి ఎం1 ఏసీ బోగీ లింకు తెగిపోయింది.

Updated : 23 May 2024 03:53 IST

రైలు నుంచి విడిపోయిన బోగీలు

విశాఖపట్నం (రైల్వేస్టేషన్‌), న్యూస్‌టుడే: విశాఖ-లింగంపల్లి (12805) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం 6.20 గంటలకు విశాఖ స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరగా కాస్త దూరం వెళ్లేసరికి ఎం1 ఏసీ బోగీ లింకు తెగిపోయింది. దాని వెనుక మరో రెండు ఏసీ బోగీలతో పాటు 5 సాధారణ బోగీలు ఉన్నాయి. వీటిని వదిలేసి సుమారు 100 మీటర్ల మేర రైలు ముందుకు వెళ్లిపోయింది. రైలు గార్డు లోకోపైలట్లకు, స్టేషన్‌ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే రైలును నిలిపివేసి ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చి బోగీల్లోని ప్రయాణికులను దించేశారు. ఎం1 ఏసీ బోగీ కప్లింగ్‌ను తొలగించి కొత్తది జత చేసి రైలును సిద్ధం చేయడానికి సుమారు 2గంటల సమయం తీసుకుంది. ఎట్టకేలకు ఉదయం 9.30 గంటల సమయంలో రైలు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లింది. 3 గంటల సేపు ప్లాట్‌ఫామ్‌పై నిరీక్షించాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని