వాట్సప్‌ డీపీలో హైకోర్టు న్యాయమూర్తి ఫొటో.. రూ.50 వేలు మోసపోయిన జిల్లా జడ్జి

సామాన్యులనే కాదు న్యాయమూర్తులనూ సైబర్‌ దొంగలు వదలడం లేదు. వాట్సప్‌ డీపీలో ఫొటో చూసి మహారాష్ట్రలోని సోలాపుర్‌కు చెందిన జిల్లా జడ్జి రూ.50 వేలు మోసపోయారు.

Updated : 26 May 2024 05:51 IST

ముంబయి: సామాన్యులనే కాదు న్యాయమూర్తులనూ సైబర్‌ దొంగలు వదలడం లేదు. వాట్సప్‌ డీపీలో ఫొటో చూసి మహారాష్ట్రలోని సోలాపుర్‌కు చెందిన జిల్లా జడ్జి రూ.50 వేలు మోసపోయారు. జడ్జి మొబైల్‌కు శుక్రవారం ఓ వాట్సప్‌ సందేశం వచ్చింది. అందులో తాను బాంబే హైకోర్టు న్యాయమూర్తినని, రూ.50,000 పంపాలని, సాయంత్రం ఇస్తానని అవతలి వ్యక్తి పేర్కొన్నారు. వాట్సప్‌ డీపీలో న్యాయమూర్తి ఫొటో ఉంది. దీంతో నిజమేనని నమ్మి సందేశం పంపిన వ్యక్తికి జిల్లా జడ్జి డబ్బులు పంపించారు. తర్వాత అవతలి వ్యక్తి నుంచి మరిన్ని డిమాండ్లు రావడంతో అనుమానం వచ్చి.. హైకోర్టు రిజిస్ట్రార్‌ను సంప్రదించారు. సంబంధిత న్యాయమూర్తి ఎలాంటి డబ్బులు కోరలేదని రిజిస్ట్రార్‌ తెలపడంతో మోసపోయానని గ్రహించి ఆ జిల్లా జడ్జి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు