వ్యక్తికి గుండు కొట్టించి.. మూత్రం తాగించిన బంధువులు

కొందరు కలిసి ఓ వ్యక్తి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతానికి చెందిన కొందరికి బంధువు వరసయ్యే ఒకరితో కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది.

Published : 29 May 2024 06:00 IST

గుణ: కొందరు కలిసి ఓ వ్యక్తి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతానికి చెందిన కొందరికి బంధువు వరసయ్యే ఒకరితో కొద్దిరోజుల క్రితం గొడవ జరిగింది. ఈ నెల 22న అతడిని కిడ్నాప్‌ చేసి రాజస్థాన్‌కు ఎత్తుకెళ్లారు. అక్కడ అతడికి గుండు కొట్టించి.. మహిళల దుస్తులు తొడిగించి.. మెడలో చెప్పుల దండ వేసి.. మూత్రం తాగించారు. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసిన నిందితులు.. దాన్ని సోషల్‌ మీడియాలో పోస్టు చేసి రూ.25 లక్షలు డిమాండ్‌ చేశారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. మూడు రోజుల్లోగా రూ.20 లక్షలు ఇవ్వాలని హెచ్చరించి బాధితుడిని వదిలేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురిపై కేసు నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు