కుటుంబంలోని 8 మందిని నరికి చంపాడు

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో దారుణం జరిగింది. మానసిక పరిస్థితి బాగాలేని ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని హతమార్చాడు. అనంతరం తానూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు.

Published : 30 May 2024 07:26 IST

అనంతరం తానూ ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లో దారుణం

ఛింద్వాడా: మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో దారుణం జరిగింది. మానసిక పరిస్థితి బాగాలేని ఓ వ్యక్తి తన కుటుంబానికి చెందిన ఎనిమిది మందిని హతమార్చాడు. అనంతరం తానూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. బోదల్‌ కచర్‌ గ్రామంలో బుధవారం తెల్లవారు జామున 2:30 గంటలకు ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దినేశ్‌ సరియమ్‌(26) అనే వ్యక్తి తన భార్య, తల్లి, సోదరి, ముగ్గురు చిన్నారులు సహా 8మంది కుటుంబ సభ్యులను గొడ్డలితో నరికేశాడని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని