విమానాశ్రయానికి బాంబు బెదిరింపు

బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది.

Published : 30 May 2024 04:42 IST

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. విమానాశ్రయంలోని ఆల్ఫా-3 భవంతిలో ఉన్న ఒక వాష్‌రూం అద్దంపై బాంబు బెదిరింపు సందేశాలను గుర్తు తెలియని నిందితుడు కన్నడలో రాశాడు. మరో 25 నిమిషాల్లో తాను పెట్టిన బాంబులతో భవంతులు పేలిపోతాయని దానిపై రాసి ఉంది. బుధవారం ఉదయం దానిని గుర్తించిన అక్కడి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్షుణ్ణంగా సోదాలు చేసిన అనంతరం దానిని ఉత్తుత్తి బెదిరింపుగా గుర్తించారు. సీసీ కెమెరా రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు