ఆర్టీసీ కార్గో డ్రైవర్‌పై దాడి

ఆర్టీసీ కార్గో వాహన డ్రైవర్‌పై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Published : 30 May 2024 04:44 IST

ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే: ఆర్టీసీ కార్గో వాహన డ్రైవర్‌పై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ కార్గో వాహనం అటుగా వచ్చింది. పోలీసులు, ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్న కొందరు యువకులు దాన్ని గమనించి ఆపాలని చెప్పారు. కార్గో డ్రైవర్‌ శ్రీనివాసరావు వాహనాన్ని అలాగే ముందుకు పోనివ్వడంతో యువకులు, డ్రైవర్‌కు వాగ్వాదం నెలకొంది. అనంతరం డ్రైవర్‌ వాహనాన్ని వేగంగా ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లారు. కోపోద్రిక్తులైన యువకులు వాహనాన్ని వెంబడించి అడ్డుకున్నారు. ముగ్గురు యువకులు డ్రైవర్‌ శ్రీనివాసరావుపై దాడి చేశారు. శ్రీనివాసరావు తలకు గాయమైంది. హైవే పెట్రోలింగ్‌ పోలీసులు వచ్చి శ్రీనివాసరావును ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ భవానీపురంలోని ప్రైవేటు కంపెనీల్లో సూపర్‌వైజర్లుగా పనిచేసే వారిగా గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని