పిడుగుపాటుకు బాలుడు.. అయిదుగురు రైతుల దుర్మరణం

రాష్ట్రంలో శుక్రవారం పిడుగుపాటుకు గురై ఆరుగురు మృత్యువాతపడ్డారు. వీరంతా పొలం పనుల్లో ఉండగానే ఈ ఘటనలు చోటు చేసుకోవడం విచారకరం.

Published : 08 Jun 2024 06:39 IST

న్యూస్‌టుడే యంత్రాంగం: రాష్ట్రంలో శుక్రవారం పిడుగుపాటుకు గురై ఆరుగురు మృత్యువాతపడ్డారు. వీరంతా పొలం పనుల్లో ఉండగానే ఈ ఘటనలు చోటు చేసుకోవడం విచారకరం. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం విఠలాపూర్‌లో శుక్రవారం బొడబండ ముష్టి ఆశప్ప(62), ఆయన సోదరుడి భార్య కౌసల్య(50) పొలం నుంచి ఇంటికి బయలుదేరుతుండగా పిడుగుపడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం దుర్గానగర్‌తండాలో సరితాబాయి, ఆమె కుమారుడు జాదవ్‌ కృష్ణ(14)లు పొలం పనుల్లో ఉండగా వర్షం కురవడంతో పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. దానిపై పిడుగుపడడంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి స్వల్పంగా గాయపడ్డారు. మెదక్‌ మండలం రాజ్‌పల్లిలో మార్గం సిద్ధిరాములు(55), వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం నాగసార్‌ గ్రామానికి చెందిన దాసరి రాములు(28), మెదక్‌ జిల్లా చిలప్‌చెడ్‌ మండలం చిట్కుల్‌ గ్రామంలో నర్సమ్మ(48) సైతం పొలంలో చెట్టు కింద ఉండగా పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందారు. సిద్ధిరాములు భార్య రాధ, మరదలు నవనీతలు గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని