మాజీ ఎమ్మెల్యే వర్మ కారుపై దాడి

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ కారుపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. కొందరు ఇటుకలు, రాళ్లు, సీసాలతో దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు.

Published : 08 Jun 2024 06:39 IST

దాడిలో ధ్వంసమైన వర్మ కారు

గొల్లప్రోలు, న్యూస్‌టుడే: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ కారుపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. కొందరు ఇటుకలు, రాళ్లు, సీసాలతో దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టారు. పవన్‌ కల్యాణ్‌ విజయానికి సహకరించిన వారిని కలిసి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమంలో భాగంగా వన్నెపూడి గ్రామ సర్పంచి కందా సుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా స్థానిక దత్తాత్రేయస్వామి ఆలయం ఎదుట కొందరు వ్యక్తులు వర్మ కారును నిలిపి దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో కారులో వర్మతో పాటు తెదేపా మండల అధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, జడ్పీటీసీ మాజీ సభ్యులు మడికి సన్యాసిరావు, బర్ల అప్పారావు తదితరులున్నారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ హనుమంతరావు, సీఐ శ్రీనివాస్, ఎస్సై బాలాజీ పరిశీలించి వర్మతో మాట్లాడారు. కొంతమంది తన కారుపై రాళ్లు, సీసాలతో దాడి చేశారని వర్మ తెలిపారు. ఇలాంటి పిరికిపంద చర్యలకు భయపడేది లేదన్నారు. దాడిని నిరసిస్తూ గొల్లప్రోలు పోలీస్‌స్టేషన్‌ ఎదుట తెదేపా కార్యకర్తలు ధర్నా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని