డీసీఎం ఢీకొని ముగ్గురు జైన మత ప్రచారకుల దుర్మరణం

పాదయాత్రగా వెళ్తున్న జైన మత ప్రచారకులపై ఓ డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది.

Published : 10 Jun 2024 04:39 IST

వనపర్తి జిల్లా మీదుగా వెళ్తుండగా ఘటన 

పెబ్బేరు, న్యూస్‌టుడే: పాదయాత్రగా వెళ్తున్న జైన మత ప్రచారకులపై ఓ డీసీఎం దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై హరిప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఐదుగురు జైన మతస్థులు విజ్ఞాన్‌ ప్రజ్ఞాసూరజ్‌ మహరాజ్, పునీత్‌ మహరాజ్‌(50), ప్రియాంకర్‌ మహరాజ్, భగవాన్‌ భాయి(36), హేమల్‌ ప్రవీణ్‌షా(52) ఈ నెల 3న హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు పాదయాత్రగా బయలుదేరారు. పెబ్బేరు మండలం రంగాపూర్‌ నుంచి ఆదివారం తెల్లవారుజామున కర్నూలు వైపు బయలుదేరారు. రంగాపూర్‌ సమీపంలో హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న డీసీఎం వారిపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో భగవాన్, హేమల్‌ ప్రవీణ్‌షా అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మిగతా ముగ్గురిని స్థానికులు గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పునీత్‌ మహరాజ్‌ కూడా చనిపోయారు. కర్ణాటకకు చెందిన డీసీఎం డ్రైవర్‌ నరేశ్, క్లీనర్‌ హరీశ్‌ అతివేగం, అజాగ్రత్తగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించి వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు