Hyderabad: కాలేజీ వ్యాన్‌ ఢీకొని జీహెచ్‌ఎంసీ కార్మికురాలు మృతి

కింగ్‌కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు సునీత(35) మృతి చెందింది.

Updated : 28 Aug 2023 12:10 IST

హైదరాబాద్‌: కింగ్‌కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు సునీత(35) మృతి చెందింది. అయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ కళాశాలకు చెందిన బస్సు అతివేగంగా వచ్చి రహదారి పక్కనే ఉన్న చెట్టు దగ్గర శుభ్రం చేస్తున్న కార్మికురాలిని బలంగా ఢీకొట్టింది. వెంటనే స్థానికంగా ఉన్న జీహెచ్‌ఎంసీ కార్మికులు స్పందించి.. ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సార్‌.. నన్ను గుర్తుపట్టారా..? నా ప్రాణాలు కాపాడింది మీరే

అయితే అప్పటికే సునీత మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న నారాయణగూడ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి శవాగారానికి తరలించారు. బస్సును సీజ్‌ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని