Crime news: పరాయి వ్యక్తితో మాట్లాడుతోందని.. గొడ్డలితో నరికేశారు

పరాయి వ్యక్తితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందని ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు ఓ బాలికను గొడ్డలితో నరికి చంపేశారు.

Published : 26 Aug 2023 22:31 IST

లఖ్‌నవూ: కుటుంబ సభ్యులే ఆ బాలిక పాలిట యమకింకరులయ్యారు. వద్దని చెప్పినా వినకుండా పరాయి వ్యక్తితో మాట్లాడుతోందన్న ఆగ్రహంతో కన్న కూతుర్నే అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశాడో తండ్రి. ఇందుకు కుమారులు సహకరించారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌పుర్‌లో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తిక్రీ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక ఆదే గ్రామంలోని ఓ వ్యక్తితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండేది. ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు వద్దని గట్టిగా వార్నింగ్‌ ఇచ్చినా ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. గత కొన్ని రోజులుగా ఇంట్లో ఇదే గొడవ కొనసాగుతోంది. దీంతో ఆగ్రహం చెందిన ఆమె తండ్రి మన్‌రఖన్‌ సింగ్‌ ఇవాళ ఉదయం ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు. దీనికి ఆమె సోదరులు రాధేశ్యామ్‌, ఘనశ్యామ్‌లు సహకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితులు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ బ్రిజేశ్‌కుమార్‌ శ్రీవాత్సవ తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని