Crime News: హైదరాబాద్‌లో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు.. పరారీలో వైద్యుడు

రాష్ట్ర రాజధానిలో నిత్యం ఎక్కడో ఒక చోట హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

Updated : 22 Feb 2024 10:00 IST

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో నిత్యం ఎక్కడో ఒక చోట హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా గురువారం తెల్లవారుజామున బొల్లారం పరిధిలో వేగంగా కారు నడుపుతూ వచ్చిన ఓ వైద్యుడు.. తోపుడుబండ్లపైకి దూసుకెళ్లాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే ఉన్న పలువురు స్థానికులు వెంటాడి కారును అడ్డగించి వైద్యుడిని పట్టుకున్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి నగరంలోని ఓ ఆస్పత్రికి చెందిన న్యూరోసర్జన్‌ అని తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో సయ్యద్‌ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. తన ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తామని చెప్పి బాధితుడిని కారులో తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అత్తాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పాషాను చేర్పించి అక్కడి నుంచి వైద్యుడు పరారయ్యాడు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని.. బిల్లులు కట్టలేక ఇబ్బంది పడుతున్నట్లు కుటుంబసభ్యులు వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని