జలపాతంలో పడి.. కర్ణాటకలో హైదరాబాద్‌ యువకుడు మృతి

హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు (Hyderabad) కర్ణాటకలో మృతిచెందాడు. జలపాతం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా నీటిలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

Published : 11 Jun 2024 10:33 IST

చిక్కమగళూరు: స్నేహితుడితో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ హైదరాబాద్‌ యువకుడి (Hyderabad youth dies) కథ విషాదాంతమైంది. కర్ణాటకలోని (Karnataka) ఓ జలపాతం వద్ద ప్రమాదవశాత్తూ నీటిలో జారిపడి అతడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హైదరాబాద్‌కు చెందిన శ్రవణ్‌ (25) ఇటీవల తన స్నేహితుడితో కలిసి చిక్కమగళూరు టూర్‌కు వచ్చాడు. వీరిద్దరూ బైక్‌ అద్దెకు తీసుకుని కొన్ని పర్యటక ప్రాంతాలను సందర్శించారు. సోమవారం కెమ్మనగుండిలోని హెబ్బె జలపాతం (Hebbe waterfalls) వద్దకు చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తుండటంతో జలపాతం వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

లండన్‌లో కోనూరు యువకుడి మృతి

ఈత రానప్పటికీ వీరిద్దరూ ఇక్కడ సెల్ఫీ (Selfie) కోసం ప్రయత్నించి కాలుజారి నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వీరిని రక్షించి బయటకు తీసుకొచ్చారు. అయితే, నీటిలో జారినప్పుడు శ్రవణ్ తలకు బండరాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలో సిస్టమ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని