Jharkhand: రీల్స్ పిచ్చి పీక్స్‌కు.. 100 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకి..!

సరదాగా రీల్స్‌ చేసేందుకు ఓ యువకుడు 100 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకాడు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

Published : 22 May 2024 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వల్ప వ్యవధిలోనే సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు కొందరు వెర్రి చేష్టలు చేస్తుంటారు. రీల్స్‌ మోజులో పడి ఎక్కడ ఉన్నాం.. ఏం చేస్తున్నాం అనే స్పృహను మరిచి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలా ఓ యువకుడు రీల్స్‌ కోసం ఎత్తైన ప్రదేశం నుంచి చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..

ఝార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌ జిల్లాకు చెందిన ఓ యువకుడు స్నానం చేసేందుకు తన స్నేహితులతో కలిసి సమీపంలోని క్వారీలో ఉన్న చెరువు వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలోనే రీల్స్‌ చేయాలని నిర్ణయించుకొన్నాడు. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి చెరువులోకి దూకాడు. గాయపడిన అతడు సెకన్ల వ్యవధిలోనే మునిగిపోయాడు.

ప్రమాదానికి ముందు.. బార్‌లో 90 నిమిషాల్లో 48వేలు ఖర్చు చేసి..!

సమీపంలోని వారు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక బృందం అతడి మృతదేహాన్ని వెలికి తీసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని