Hyderabad: జూబ్లీహిల్స్‌ పోలీసుల అదుపులో హరీశ్‌రావు మాజీ పీఏ

ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated : 27 Mar 2024 15:49 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల వ్యవహారంలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో భారాస నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు మాజీ పీఏ నరేశ్‌కుమార్‌తో పాటు కొర్లపాటి వంశీ, వెంకటేశ్‌గౌడ్‌, ఓంకార్‌ ఉన్నారు. సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు దుర్వినియోగమయ్యాయంటూ మెదక్‌ జిల్లాకు చెందిన రవినాయక్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి వారిని అదుపులోకి తీసుకున్నారు.

స్పందించిన హరీశ్‌రావు కార్యాలయం

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల గోల్‌మాల్‌ వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయం స్పందించింది. హరీశ్‌రావు పీఏ.. సీఎంఆర్ఎఫ్‌ చెక్కులు కాజేశారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. నరేశ్‌ అనే వ్యక్తి హరీశ్‌రావు వద్ద పీఏ కాదని,  కంప్యూటర్‌ ఆపరేటర్‌గా.. తాత్కాలిక ఉద్యోగిగా కార్యాలయంలో పనిచేశారని తెలిపింది. ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత డిసెంబరు 6న కార్యాలయం మూసివేసి సిబ్బందిని పంపించేశామని తెలిపారు. ఆ క్రమంలో సమాచారం లేకుండా కొన్ని చెక్కులను నరేశ్‌ తన వెంట తీసుకెళ్లినట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై వెంటనే నార్సింగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపజేయడం బాధాకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని