కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!

Crime News: మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి కన్న కుమార్తెలను ఘోరమైన మనో వేదనకు గురిచేసింది. ఆమె చర్యలను తీవ్రంగా ఖండించిన కోర్టు.. 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది.  

Updated : 28 Nov 2023 12:08 IST

తిరువనంతపురం: కంటికిరెప్పలా కాపాడాల్సిన బిడ్డల్ని ఓ తల్లి మానవత్వం మరిచి కీచకులకు అప్పగించింది. మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది. ఈ కేసును తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆమెకు పోక్సో చట్టం కింద 40 ఏళ్ల జైలు శిక్షను విధించింది. కేరళ(Kerala)లో ఈ ఘటన జరిగింది.

ఈ కేసులో ఏం జరిగిందంటే..?

పోలీసులు కథనం ప్రకారం.. తన భర్త మానసికంగా అనారోగ్యానికి గురికావడంతో నిందితురాలు అతడిని వదిలేసి, శిశుపాలన్ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఏడేళ్ల చిన్న కుమార్తె అప్పుడు ఆమె వద్దే ఉండేంది. శిశుపాలన్ ఆ బాలికను లైంగిక వేధించడంతో.. ఆమె గాయపడింది. ఆ పసిప్రాణం తన బాధను తల్లికి చెప్పింది. కానీ, నిందితురాలు ఆ బిడ్డ మాటలు పట్టించుకోకపోగా.. ఆమెను పదేపదే శిశుపాలన్ ఇంటికి పంపి, లైంగిక దాడికి సహకరించింది. కొద్దిరోజులకు తన వద్దకు వచ్చిన అక్క(11 ఏళ్లు)కు ఆ చిన్నారి తన గోడును చెప్పుకొంది. మరోవైపు పెద్ద కుమార్తెను కూడా శిశుపాలన్ వదల్లేదు.

సొరంగం వద్ద శరవేగంగా పనులు.. ఇంకా 10 మీటర్ల దూరంలో కూలీలు

దాంతో ఒకరోజు ఈ ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి తప్పించుకొని తమ బామ్మ ఇంటికి వెళ్లారు. ఆమె ద్వారా విషయం బయటకు రావడంతో పిల్లల్ని బాలల సంరక్షణా కేంద్రానికి తరలించారు. అప్పుడే ఆ బాలికలు తాము ఎదుర్కొన్న భయానక పరిస్థితుల అక్కడి అధికారులకు వెల్లడించారు. ఇదంతా 2018-2019 మధ్య జరిగింది. శిశుపాలన్‌తో పాటు మరో వ్యక్తి కూడా వారిపై లైంగిక దాడి చేసినట్లు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్‌ఎస్‌ విజయ్‌ మోహన్ మీడియాకు వెల్లడించారు.

కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు (Kerala special Fast Track Court) ఈ కేసును తీవ్రంగా పరిగణించింది. ఆ తల్లి చర్యలు మాతృత్వానికే అవమానకరమని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ.. 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే రూ.20 వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలోనే శిశుపాలన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో 22 మంది సాక్షుల్ని విచారించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని