Andhra news: ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్‌ తెగిపడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 19 Apr 2024 22:40 IST

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రమాదం జరిగింది. స్థానిక వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో లిఫ్ట్‌ తెగిపడి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లిఫ్ట్‌ వైర్లు తెగిపోవడంతో మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. క్షతగాత్రులకు అదే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను చిన్నమండెం మండలం కదిరివాండ్లపల్లె, రాయచోటి వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని రాయచోటి తెదేపా అభ్యర్థి రాంప్రసాద్‌ రెడ్డి పరామర్శించారు. నెల రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో లిఫ్ట్‌ తెగిపడటంతో ముగ్గురికి గాయాలయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని