Viral news: మర్మాంగంలోకి ఎయిర్‌ బ్లోయర్‌ నాజిల్‌.. యువకుడు మృతి

ఎయిర్‌ బ్లోయర్‌ నాజిల్‌ను మర్మాంగంలోకి చొప్పించడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Published : 29 Mar 2024 00:18 IST

బెంగళూరు: ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న సరదా సంఘటన ఒకరి ప్రాణాలు తీసింది. వాహనాలను కడిగిన తర్వాత నీటిని తొలగించేందుకు ఉపయోగించే ఎయిర్‌ బ్లోయర్‌ నాజిల్‌ను స్నేహితుడి మర్మాంగంలోకి చొప్పించడంతో యువకుడు మృతి చెందాడు. మార్చి 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు. బెంగళూరులోని సంపెగహళ్లి ప్రాంతానికి చెందిన యోగేశ్‌ (24), స్థానిక వాషింగ్‌ సెంటర్‌లో పని చేస్తున్న 25 ఏళ్ల తన స్నేహితుడు మురళి దగ్గరికి వెళ్లాడు. తన బైక్‌ను సర్వీసింగ్‌ చేయాల్సిందిగా కోరారు. ఆ తర్వాత అక్కడున్న ఎయిర్‌ బ్లోయర్‌తో వారిద్దరూ సరదాగా ఆడుకున్నారు. తొలుత మురళి ఎయిర్‌ బ్లోయర్‌తో యోగేశ్‌ ముఖంపై గాలి కొట్టాడు. అతడు తప్పించుకోవడంతో పట్టుకొని బ్లోయర్‌ నాజిల్‌ను అతడి మర్మాంగంలోకి చొప్పించి, దానిని ఆన్‌ చేశాడు. దీంతో అతడి పొట్ట ఉబ్బిపోయి.. సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరిశీలించిన వైద్యులు గాలి ఒత్తిడి వల్ల అవయవం లోపలి భాగాలు దెబ్బతిన్నాయని, శస్త్రచికిత్స అవసరమని సూచించారు. చికిత్స చేసినప్పటికీ.. అతడి ప్రాణాలు నిలవలేదు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని