ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని విచారించిన దర్యాప్తు బృందం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సంధ్యా శ్రీధర్‌రావును అధికారులు విచారిస్తున్నారు.

Published : 31 Mar 2024 14:30 IST

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి సంధ్యా శ్రీధర్‌రావును అధికారులు విచారిస్తున్నారు. తన ఫోన్‌ సైతం ట్యాపింగ్‌ చేశారంటూ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం సంధ్యా శ్రీధర్‌రావును బంజారాహిల్స్‌ పీఎస్‌కు పోలీసులు పిలిపించారు. న్యాయవాదితో కలిసి హాజరైన ఆయన వాంగ్మూలాన్ని దర్యాప్తు బృందం రికార్డు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని