Crime News: బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అరెస్టు

బంగారంలో పెట్టుబడి అంటూ రూ.6.12 కోట్లు మోసం చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 20 Apr 2024 22:01 IST

హైదరాబాద్‌: బంగారంలో పెట్టుబడి అంటూ రూ.6.12 కోట్లు మోసం చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను సైబరాబాద్‌ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. కొండాపూర్‌లో నివాసముంటున్న పుత్తూరుకు చెందిన గంట శ్రీధర్‌.. 13 మంది నుంచి రూ.6.12 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బంగారం కోసం గ్రాముకు రూ.5,950 చొప్పున పెట్టుబడి పెడితే, సుమారుగా 25 రోజుల్లో బంగారం ఇస్తానని బాధితులకు తెలిపాడు. ఈ స్కీమ్‌ పట్ల ఆకర్షితులైన బాధితులు పెద్ద మొత్తంలో నగదును శ్రీధర్‌కు చెల్లించారు. గడువు తేదీ ముగిసినా బంగారం ఇవ్వకపోవడంతో బాధితుల్లో ఒకరు సైబరాబాద్‌ ఆర్థికనేర విభాగంలో ఫిర్యాదు చేయడంతో విషయం బట్టబయలైంది. అనుమానాస్పదంగా ఉండే ఎలాంటి స్కీమ్‌లకు ఆకర్షితులు కావొద్దని, ఇలాంటి ఆర్థిక నేరాలు జరిగితే తమను సంప్రదించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని