Praneeth Rao case: ప్రణీత్‌రావు కేసులో కీలక మలుపు.. ఇద్దరు ఏఎస్పీలు అరెస్టు

ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

Published : 24 Mar 2024 00:04 IST

హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌కుమార్‌ అలియాస్‌ ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారు కూడా పోలీసు శాఖకు చెందిన అదనపు ఎస్పీలు కావడం సంచలనంగా మారింది. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టు అయిన వారిలో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, సీఎస్‌డబ్ల్యూ అదనపు ఎస్పీ తిరుపతన్న ఉన్నారు. వీరిని ఆదివారం జడ్జి ముందు హాజరుపరచనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని