Robbery: ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ

ప్రముఖ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. కోయంబత్తూరులోని  జోస్‌ ఆలుక్కాస్‌ గోల్డ్‌ షాప్‌లో దాదాపు 25కిలోల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు.

Updated : 28 Nov 2023 15:35 IST

(ప్రతీకాత్మక చిత్రం)

Jos Alukkas robbery కోయంబత్తూరు: ప్రముఖ నగల వ్యాపార సంస్థ జోస్‌ ఆలుక్కాస్‌ అండ్‌ సన్స్‌లో భారీ చోరీ చోటుచేసుకుంది. తమిళనాడు కోయంబత్తూరులోని గాంధీపురంలో వున్న జోస్‌ ఆలుక్కాస్‌ దుకాణంలో దాదాపు 25కిలోల బంగారు ఆభరణాలు దోపిడీకి గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ముసుగు ధరించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి 2.30గంటల సమయంలో దుకాణంలోకి చొరబడినట్టుగా ఆ వీడియోలో రికార్డయ్యాయి.

కన్నకూతుళ్లను కీచకులకు అప్పగించిన తల్లికి.. 40 ఏళ్ల జైలు శిక్ష..!

ఈ ఘటనపై కోయంబత్తూరు పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఈ ఘటనలో ఒకే అనుమానితుడు వున్నట్టు తెలుస్తోందన్నారు. నిందితుడి కోసం గాలించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సోమవారం రాత్రి దుకాణం మూసివేసిన ఉద్యోగులు.. ఉదయం మళ్లీ వచ్చి చూసేసరికి లోపల అంతా చెల్లాచెదురుగా పడి ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం లోపలికి వెళ్లి పరిశీలించగా.. దుకాణం వెనుక గోడ పగులగొట్టి బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు గుర్తించి అంతా షాకైనట్లు సమాచారం. ఈ దోపిడీ ఘటనపై వెంటనే దుకాణం యజమానికి, పోలీసులకు సమాచారం అందించారు. దోపిడీ చేసిన నగల విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని