Ganja trafficking Gang: 208 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు

విజయనగరం నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 03 Sep 2023 14:28 IST

హైదరాబాద్: విజయనగరం నుంచి మహారాష్ట్రకు లారీలో గంజాయి తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 208 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులతో కలిసి టీఎస్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) అధికారులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను టీఎస్‌ న్యాబ్‌ ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు.

మేక పోయిందని.. మానవత్వం మరచి..

నిందితులు ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో 50వేల ఎకరాల్లో గంజాయి పండిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ‘‘ప్రణాళిక ప్రకారం నిందితులను పట్టుకున్నాం. విజయనగరం నుంచి జడ్చర్ల మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారు. గంజాయి తరలించే లారీకి 30కి.మీ ముందు కారు వెళ్తుంటుంది. ఎక్కడైనా పోలీస్‌ చెకింగ్ ఉందా? లేదా? చెక్ చేస్తూ వెళ్తారు. రూ.కోటి విలువైన గంజాయిని వారి నుంచి స్వాధీనం చేసుకున్నాం. నిందితులంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించాం. ప్రధాన నిందితుడు హసన్‌ పరారీలో ఉన్నాడు’’ అని ఎస్పీ సునీత తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని