April Fool: స్నేహితుడిని ‘ఏప్రిల్‌ ఫూల్‌’ చేద్దామనుకుని.. ఉరి కొయ్యకు చిక్కి!

ఉరేసుకుంటున్నట్లు నటించి మిత్రుడిని ఏప్రిల్‌ ఫూల్‌ చేద్దామని యత్నించిన ఓ యువకుడు.. ఊహించని విధంగా అదే తాడుకు బలయ్యాడు.

Published : 03 Apr 2024 00:04 IST

ఇందౌర్: స్నేహితుడిని సరదాగా ఏప్రిల్‌ ఫూల్‌ (April Fool) చేసేందుకు ప్రయత్నించిన ఓ యువకుడి కథ విషాదాంతమైంది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రాంక్‌ చేద్దామనుకుని.. ఊహించనివిధంగా అదే ఉరి కొయ్యకు వేలాడి ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఇందౌర్‌కు చెందిన ఓ యువకుడు(18) సోమవారం తన స్నేహితుడిని ఏప్రిల్‌ ఫూల్‌ చేద్దామని భావించాడు.

తీరానికి చేరిన ఆహారం చేజారి..! గాజావాసులపై ఇజ్రాయెల్‌ ‘దాడి’ ఎఫెక్ట్‌

ఈ క్రమంలోనే తన ఇంట్లో ఉన్న ఉరితాడుని మెడకు బిగించుకుని.. మిత్రుడికి వీడియో కాల్‌ చేసి, ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అంతలోనే అతడు నిల్చొని ఉన్న కుర్చీ ప్రమాదవశాత్తూ పక్కకు పడిపోయింది. దీంతో ఉరి బిగుసుకుపోయి మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని