Tadipatri: చెట్టును ఢీకొట్టిన కారు.. నలుగురి మృతి

అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Updated : 05 Aug 2023 12:51 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లాలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తాడిపత్రి మండలం రావివెంకటపల్లెలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రికి చెందిన మోహన్‌ రెడ్డి ఇటీవల కారు కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా తన స్నేహితులకు శుక్రవారం రాత్రి విందు ఇచ్చాడు. విందు అనంతరం తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న మోహన్‌రెడ్డి(27)తోపాటు విష్ణుచౌదరి (24), నరేశ్‌ రెడ్డి (28), మధుసాగర్‌ రెడ్డి (28) అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు శ్రీనివాసరెడ్డి గాయపడ్డాడు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై మహమ్మద్‌ గౌస్‌ తెలిపారు. మద్యం మత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని