NEET 2025 exam: ‘నీట్’ రాసేందుకు వెళ్తూ.. ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

జైపుర్: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష రాసేందుకు వెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వీరిలో ఇద్దరు నీట్ అభ్యర్థులు ఉండగా.. వారితో పాటు ఉన్న మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లోని జైపుర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన పెను విషాదం రేపింది. ఇద్దరు విద్యార్థినులు మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై నీట్ పరీక్ష రాసేందుకు ఆదివారం మధ్యాహ్నం పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా ఓ వంతెన వద్ద వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను ఖుషి శర్మ (21), ప్రియా శర్మ(22)గా గుర్తించారు. వీరిద్దరూ బస్సీ పట్టణం సమీపంలోని ఓ గ్రామానికి చెందినవారని తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


