Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు.   

Updated : 25 Dec 2023 02:25 IST

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. కట్టెకల్యాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దబ్బకూన గ్రామ సమీపంలోని కొండపై కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ రిజర్వ్‌ గార్డ్‌, బస్తర్‌ ఫైటర్లు పాల్గొన్నట్లు బస్తర్‌ రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. దంతెవాడ-సుక్మా జిల్లా సరిహద్దుల్లో తుమక్‌పాల్‌-దబ్బకూన పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్‌ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయిన అనంతరం సమీప ప్రాంతాల్లో గాలించగా మూడు మృతదేహాలు గుర్తించామన్నారు. పేలుడు పదార్థాలు, ఆయుధాలు గుర్తించినట్లు ఐజీ తెలిపారు. మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు, ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు