Accident: ఎన్నికల విధులకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు టీచర్లు మృతి

ఎన్నికల విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు మృతిచెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొండగాన్‌ జిల్లాలో చోటుచేసుకుంది

Updated : 08 Nov 2023 15:13 IST

కొండగాన్‌: ఛత్తీస్‌గఢ్‌ తొలి విడత ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో విషాదం చోటుచేసుకుంది. పోలింగ్‌ విధులు ముగించుకొని వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ముగ్గురు ఉపాధ్యాయులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీ వాహనం ఓ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొండగాన్‌ జిల్లా కేంద్రంలో ఈవీఎంలు అప్పగించి తిరిగి వస్తున్న సమయంలో  కేశ్‌కాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బహిగాన్‌ గ్రామం సమీపంలో ñబుధవారం ఉదయాన్నే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి

 ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారని తెలిపారు. మృతులను పాఠశాల ఉపాధ్యాయులు శివ్‌ నేతం, సంత్రం నేతం, హరేంద్ర యూకీలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు గాను రెండు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. మంగళవారం(నవంబర్‌ 7న) తొలి విడతలో 20 స్థానాలకు ఎన్నికలు పూర్తి కాగా.. మిగతా నియోజకవర్గాల్లో 17న పోలింగ్ జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని