శిరోముండనం కేసుపై నేడు విశాఖ కోర్టు తీర్పు.. ఉత్కంఠ

తీవ్ర సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు.

Updated : 16 Apr 2024 10:25 IST

విశాఖపట్నం: తీవ్ర సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. 1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు.  28 ఏళ్లపాటు ఈ కేసు విచారణ కొనసాగగా.. 148 సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని