Ghaziabad: అతిథులకు ట్రే తగిలిందని ఘాతుకం..వెయిటర్‌ను చంపి అడవిలో పడేసి..!

వివాహ వేడుకలో అతిథులకు ట్రే తగిలిందని ఓ వెయిటర్‌ను కొందరు వ్యక్తులు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అడవిలో పడేశారు.

Published : 07 Dec 2023 18:09 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో దారుణం చోటు చేసుకొంది. వివాహ వేడుకలో పాత్రలు తీసుకువెళుతున్న ట్రే అతిధులకు తగిలిందనే కారణంతో వెయిటర్‌ను కొందరు వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. ఘాజియాబాద్‌ (Ghaziabad)లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. 

అత్తమామల చేతిలో శివాని బలి.. చితిలో కాలిన శవంతో ఠాణాకు!

మనోజ్ అనే వ్యక్తి వివాహ వేడుకల కాంట్రాక్టర్‌. అతడి వద్ద పంకజ్‌(26) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఘాజియాబాద్‌లోని సీసీఎస్‌ వాటికా గెస్ట్‌ హౌస్‌లో పెళ్లి జరిగింది. అక్కడ వెయిటర్ అవసరం కావడంతో తనతో పంకజ్‌ను తీసుకెళ్లాడు.  అతడు అతిథులు భోజనం చేసిన తర్వాత పాత్రలను ఒక ట్రేలో వేసుకుని తీసుకువెళుతున్నాడు. ఈ క్రమంలోనే పొరపాటున అడ్డుగా ఉన్న అతిథులకు  ట్రే తగిలింది. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్తా గొడవకు దారి తీయడంతో పంకజ్‌ను కాంట్రాక్టర్‌ మనోజ్‌ సహా మరికొందరు తీవ్రంగా చితకబాదారు. ఆ దెబ్బలకు తాళలేక పంకజ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు నిందితులు మృతదేహాన్ని సమీపంలో ఉన్న అడవిలో పడేశారు. పనికి వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో అతడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మరుసటి రోజు మనోజ్‌ను విచారించిన పోలీసులు అడవిలో మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టంకు తరలించగా.. తలకి బలమైన గాయం తగలడం వల్లే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని