crime news: నాడు కన్నబిడ్డలను హతమార్చి.. నేడు ఆత్మహత్య!

గత నెలలో తమ కుమార్తెలను హతమార్చిన తల్లిదండ్రులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Updated : 12 Apr 2024 14:06 IST

గార్ల: గత నెలలో తమ కుమార్తెలను హతమార్చిన తల్లిదండ్రులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడేనికి చెందిన పి.అనిల్‌(26), దేవి (22)..  గ్రామానికి సమీపంలోని అడవిలో ఉరి వేసుకున్నారు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. గత నెల 10న తమ కుమార్తెలు లోహిత (2), జస్విత(1)కు పాలలో విషం కలిపి హత్య చేశారని వారిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. పోలీసులు వీరిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం అంకన్న గూడెం సమీపంలోని అడవిలో వీరిద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని