శంషాబాద్‌లో దారుణం.. మహిళను చంపి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు!

నగరంలోని శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ (30)ను దుండగులు దారుణంగా హతమార్చారు.

Updated : 11 Aug 2023 11:24 IST

హైదరాబాద్‌ (శంషాబాద్‌): నగరంలోని శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని మహిళ (30)ను దుండగులు దారుణంగా హతమార్చారు. శంషాబాద్‌ పరిధిలోని శ్రీనివాస కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళను చంపేసిన తర్వాత పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

నిందితుడి కోసం గాలింపు

ఈ ఘటనకు సంబంధించి శంషాబాద్‌ ఏసీపీ రామ్‌చందర్‌రావు వివరాలు వెల్లడించారు. మహిళ మృతదేహం కాలిపోతుందని అర్ధరాత్రి తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించినట్లు చెప్పారు. గుర్తుతెలియని మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టారని వివరించారు. మహిళను హత్యచేసి తగలబెట్టారా? లేదా సజీవ దహనం చేశారా? అనేది పోస్టుమార్టం తర్వాత తెలుస్తుందని తెలిపారు. మహిళ ఎవరనే వివరాలు సేకరిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు.. తొండుపల్లిలోని ఓ బంక్‌లో నిందితుడు బాటిల్‌లో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మహిళను తగులబెట్టిన అతడికి మరో వ్యక్తి సాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతురాలిని ఇతర రాష్ట్రానికి చెందిన మహిళగా భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని