Crime News: కాల్పులకు తెగబడినా.. చీపురు కర్రతో తరిమికొట్టిన మహిళ..!

కాల్పులకు తెగబడిన దుండగులను చీపురు కర్రతోనే తరిమికొట్టిందో మహిళ. హరియాణాలో ఈ ఘటన ఇది వెలుగుచూసింది.

Published : 29 Nov 2023 01:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ వ్యక్తిపై కాల్పులకు పాల్పడిన దుండగులను చీపురు కర్రతోనే తరిమికొట్టిందో మహిళ. ఈ క్రమంలో తనవైపూ తూటాలు దూసుకొచ్చినా వెరవలేదు! హరియాణా (Haryana)లో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం.. గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు సంబంధం ఉన్నట్లు భావిస్తోన్న హరికిషన్‌.. ఓ హత్య కేసులో నిందితుడు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. భివానీలోని ఇంటి బయట నిల్చోని ఉండగా.. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఒక్కసారిగా అతడిపై తుపాకులతో కాల్పులకు దిగారు.

ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ

దీంతో వారి నుంచి తప్పించుకుని, ఇంట్లోకి పారిపోయాడు. అప్పటికే నాలుగు బుల్లెట్లు తగలడంతో గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ.. గేటు వద్ద నుంచి దుండగులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అంతలోనే అక్కడికి వచ్చిన ఓ మహిళ.. తన వద్ద ఉన్న పొడవైన చీపురుతో వారిని తరిమింది. ఈ క్రమంలోనే తప్పించుకు పారిపోతూ.. ఓ వ్యక్తి ఆమె వైపూ కాల్పులు జరిపాడు. కానీ, ఆమెకు గాయాలేమీ కాలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. గాయాలపాలైన హరికిషన్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు