Heart Attack: వాకింగ్‌ చేస్తుండగా గుండెపోటు.. యువకుడి మృతి

వాకింగ్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 21 Jul 2023 12:27 IST

రాజాం: వాకింగ్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. రాజాం మండలం మొగిలివలసకు చెందిన శ్రీహరి (28) శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లాడు. వాకింగ్‌ చేస్తుండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా శ్రీహరి కుప్పకూలిపోయాడు. గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందాడు. శ్రీహరి ఇంజినీరింగ్‌ పూర్తిచేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో యువకుడు మృతిచెందడంతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు