logo

కేంద్రీయ విద్యాలయం రమ్మంటోంది

ఉత్తమ బోధన, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్యకు చిరునామాగా కేంద్రీయ విద్యాలయాలు నిలుస్తున్నాయి.

Published : 24 Mar 2023 03:20 IST

మంచిర్యాలలోని పాఠశాల విద్యార్థులు

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉత్తమ బోధన, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్యకు చిరునామాగా కేంద్రీయ విద్యాలయాలు నిలుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్‌ పెరుగుతోంది. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్‌ వరకు చదివే అవకాశం లభిస్తుంది.  ఈ నేపథ్యంలో దరఖాస్తుల విధానంపై ‘న్యూస్‌టుడే’ కథనం..

కేంద్రీయ విద్యాలయంలో క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దడం, ప్రయోగపూర్వక బోధనతోపాటు, క్రీడలు, యోగా, ఎన్‌సీసీ తదితర సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ బోధనలు అందిస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ఇందులో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎవరికి ప్రాధాన్యం అంటే...

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు ప్రవేశాల్లో మొదటి ప్రాధాన్యత కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ , అనుబంధ సంస్థల ఉద్యోగులకు వరుసగా రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన వారికి అయిదో ప్రాధాన్యత ఉంటుంది.

ఒకటో తరగతి ప్రవేశాల దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్‌ 17
వయస్సు: 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉండాలి
రెండో నుంచి ఇంటర్‌ తరగతి ప్రవేశాల దరఖాస్తుకు గడువు: ఏప్రిల్‌ 3 నుంచి 12 వరకు
మెరిట్ జాబితా విడుదల: ఏప్రిల్‌ 17


దరఖాస్తు విధానం..

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు http:///kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలి. రిజిస్ట్రేషన్‌ అయిన తర్వాత దరఖాస్తు నింపాలి. kvs admission యాప్‌ ద్వారా సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు నుంచి ఇంటర్‌ తరగతి ప్రవేశాలను మాత్రం ఆఫ్‌లైనులో నిర్వహిస్తారు. మెరిట్‌ ప్రకారం ప్రవేశాలను కల్పిస్తారు. ఒకటో తరగతిలో 40 సీట్లు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తరువాత లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. రెండు సీట్లు సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌కు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం సీట్లు ఉంటాయి. రెండో తరగతి నుంచి ఇంటర్‌ వరకు పాఠశాలలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా ప్రవేశాలు కల్పిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని