logo

వెయ్యిలోపు.. ఉత్కంఠ గెలుపు

ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే నిరుద్యోగులు ఎంతో శ్రమపడాలి. ఒక్క మార్కుతోనే అవకాశం కోల్పోయిన వారు ఎంతో మంది కనిపిస్తుంటారు.

Updated : 21 Oct 2023 04:53 IST

ఉద్యోగాల కోసం పోటీ పరీక్షల్లో నెగ్గాలంటే నిరుద్యోగులు ఎంతో శ్రమపడాలి. ఒక్క మార్కుతోనే అవకాశం కోల్పోయిన వారు ఎంతో మంది కనిపిస్తుంటారు. అయ్యో..ఇంకొంత కష్టపడుంటే బాగుండేదని ఫలితాలొచ్చాక బాధపడుతుంటారు. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులదీ ఇదే తీరుంటుంది. స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందితే   ఛ..అంటూ నాలుక కర్చుకుంటారు. ఆ లెక్కలు..ఈ లెక్కలు వేసుకొని ఇంకాస్త శ్రమిస్తే అయిపోయేదని ఆవేదన చెందుతారు. లక్షల సంఖ్యలో ఓటర్లుంటే వందల మెజారిటీతో గెలుపు దూరమైతే పాపం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. ఏదేమైనా విజేతలను నిర్ణయించేది ఓటర్లే కదా.. 

యూస్‌టుడే, మామడ(నిర్మల్‌ సిటీ)

నా ఒక్క ఓటే అనుకోకండి..

ఏ నియోజకవర్గాన్ని పరిశీలించినా లక్షమంది దాకా ఓటర్లుంటారు. అందులో చాలా మంది ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఓటేమేస్తాంలే అని కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితాలొచ్చాక స్వల్ప ఆధిక్యంతో అభ్యర్థి విజయం సాధిస్తే అరే..మేము ఓటేసుంటే ఫలితం తారుమారయ్యేదని చర్చించుకుంటారు. స్థానిక ఎన్నికల్లో వెయ్యి ఓట్ల మెజారిటీ వస్తే అధి భారీ విజయంగా.. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలుపొందితే స్వల్ప ఆధిక్యంగా చెబుతారు. ప్రస్తుతం అన్ని పార్టీలు బలంగా ఉన్నాయి. అభ్యర్థులందరూ విజయం కోసం బాగానే శ్రమిస్తారు. గెలుపోటములను అంచనా వేయడం కష్టమేనన్న అభిప్రాయాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. అందుకే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయడం మరిచి పోవద్దు. తక్కువ మెజారిటీతో గెలుపొందితే వాటిలో మీ ఓట్లే కీలకమవుతాయి.

ఆరున్నర దశాబ్దాల్లో ఇవీ ‘తక్కువ’ రికార్డులు..

1957 సంవత్సరం నుంచి ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మెజారిటీలను పరిశీలిస్తే కొద్దిలో(వెయ్యి ఓట్ల లోపు) కుర్చీలో కూర్చోలేక పోయామని బాధపడ్డవారు, హమ్మయ్య నయమైంది కొంచెంలో గట్టెక్కామనుకునే వారున్నారు.  1500లోపు మెజారిటీతో గెలుపొందిన ఎమ్మేల్యేలూ ఉన్నారు.

1500లోపు మరి కొందరు...

  • 1957లో సిర్పూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకటస్వామి ప్రత్యర్థి రాజమల్లు(పీఎస్పీ)పై 1131 ఓట్లతో గెలుపొందారు.
  • 1962లో ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి విఠల్‌రావు సమీప ప్రత్యర్థి రాంకిష్టు (సీపీఐ)పై 1054 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • 1967లో ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థి రాంకిష్టు ప్రత్యర్థి ఏ.వి.రామన్న(కాంగ్రెస్‌)పై 1154 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • 1983లో ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి అంబాజీ సమీప స్వతంత్ర అభ్యర్థి గోవింద్‌ నాయక్‌పై 1261 ఓట్లతో గెలుపొందారు.

  • నియోజకవర్గం
  • విజేత పేరు: వచ్చిన ఓట్లు
  • ప్రత్యర్థి: వచ్చినవి
  • ఆధిక్యం

ముథోల్‌  (2009లో)

  • ఎస్‌.వేణుగోపాలచారి (తెదేపా)  45,019
  • విఠల్‌రెడ్డి(పీఆర్పీ) 44,836  
  • 183

ఆసిఫాబాద్‌ (1983)

  • జి. మల్లేష్‌(సీపీఐ) 17,623
  •  దాసరి నర్సయ్య(కాంగ్రెస్‌)17,320
  • 303

ఆదిలాబాద్‌ (1957)

  • రంగనాథరావు (పీడీఎఫ్‌) 15,230
  • భోజారెడ్డి(కాంగ్రెస్‌) 14,888
  • 342

ఖానాపూర్‌ (1989)

  • కోట్నాక భీంరావు  (కాంగ్రెస్‌) 34,125
  • గోవింద్‌నాయక్‌(తెదేపా)33,679 
  • 446

ఆదిలాబాద్‌ (1983)

  • సి.వామన్‌రెడ్డి (స్వతంత్ర)26,871
  • సి.రామచంద్రారెడ్డి(కాంగ్రెస్‌)26,362
  • 509

నిర్మల్‌ (1957)

  • ముత్యంరెడ్డి (స్వతంత్ర)  9493
  • ఆర్‌.దేశ్‌పాండే (కాంగ్రెస్‌)8700
  • 793

ముథోల్‌ (1999)

  • గడ్డెన్న(కాంగ్రెస్‌) 57,193
  • నారాయణరావు పటేల్‌(తెదేపా) 56,343
  • 850

ముథోల్‌ (1957)

  • గోపిడి గంగారెడ్డి (స్వతంత్ర)12,674
  • రంగారావు (కాంగ్రెస్‌) 11,772
  • 902
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని