logo

కళలకు నిలయం బాలకేంద్రం

వివిధ భారతీయ కళలకు నిలయంగా బాలకేంద్రం నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది ఉదయశ్రీ అన్నారు.

Published : 28 Apr 2024 12:12 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: వివిధ భారతీయ కళలకు నిలయంగా బాలకేంద్రం నిలుస్తుందని జిల్లా విద్యాశాఖ కార్యాలయం సిబ్బంది ఉదయశ్రీ అన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 5 నుంచి 16 ఏళ్లలోపు బాల బాలికలకు శాస్త్రీయ నృత్యం, సంగీత వాయిద్యం, చిత్రలేఖనం, క్రాఫ్ట్, కరాటే వంటి అంశాలు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఈ వేసవి సెలవుల్లో తమ పిల్లలను బాలకేంద్రంలో శిక్షణ కోసం పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలకేంద్రం పర్యవేక్షకుడు మిట్టు రవి, శిక్షకులు దత్తు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని